ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గుడ్ మార్నింగ్...!!

 

గుడ్ మార్నింగ్ అని ప్రతి రోజూ

వేకువ నే పంపే మొదటి మెసేజ్ 

నిద్ర లేవగానే 

మొదట మాట్లాడేది నీతోనే అని

నీ అమూల్యమైన పరిచయం 

నిత్యం నాతోనే ఉంటుందని 

ప్రతి వేకువ నా మొదటి 

ఆలోచన నువ్వేనని 

నీకు తెలియాలని...

గుడ్ నైట్ అని ప్రతి రాత్రి 

నీకు పంపే మెసేజ్ 

నిద్రించే ముందు 

చివరిగా మాట్లాడేది నీతోనేనని

నీ జ్ఞాపకాలెప్పుడూ నాతోనే ఉంటాయని

ప్రతి రాత్రి నాకు తోడుగా వుండేవి

సేద తీర్చేవి నీ జ్ఞాపకాలేనని

ఆ జ్ఞాపకాల్లోని నువ్వే 

నా నిద్రలోనూ తోడున్నావని నీకు చెప్పేందుకే...

వేకువన నీ ఆలోచనతో మొదలై

రాత్రి నీ ఆలోచనలతోనే విశ్రమిస్తుంది మనసు...

మళ్ళీ వేకువ వస్తుంది 

మళ్ళీ రాత్రి వస్తుంది 

వేకువలోను రాత్రిలోను

తోడుగా ఉంటున్నది... ఉండేది 

నువ్వు మాత్రమే... 

20-11-2023

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్