ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బోల్డంత ప్రేమనిచ్చావు...


 

 బోల్డంత ప్రేమనిచ్చావు. 

ఎప్పుడూ అనుభవించనంత సంతోషాన్ని పొందాను. 

ఇప్పుడు  ఆ సంతోషాన్ని నీకు ఇచ్చేసి, 

నువ్విచ్చిన ప్రేమను, ఆ ప్రేమ మిగిల్చిన బాధను 

నేను తీసుకొని వెళ్ళి పోతున్నాను.

నువ్వు కోరుకున్న సంతోషం ఇదేగా...

ఈ ప్రేమ ఒక పీడకల అనుకో...

మెలకువ రాగానే ఆ కలను మర్చిపోయినట్లు

ఈ ప్రేమనూ మర్ఛిపో... సంతోషంగా వుండు 

నేను దేవుని సన్నిధిలో వాగ్దానం చేశాను 

నీ చెయ్యి ఎన్నడూవిడువనని.

జీవితాంతం ఆ మాటకే కట్టుబడి వుంటాను.

సంతోషం నీకిచ్చేయగా మిగిలిన 

మన ప్రేమ, మన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే వుంటాయి.

ప్రాణం వున్నంత వరకు నాకు  తోడుగా వుంటాయి.


22-11-2023

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్