ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2023లోని పోస్ట్‌లను చూపుతోంది

చలి రాత్రులు..

  చలి రాత్రులు... నిను మరీమరీ గుర్తు చేస్తాయి మిద్దెపైకి ఎక్కుతాను చల్లగాలి ఒక్కసారిగా అచ్చంగా నువు కౌగిలించుకున్నట్లే అల్లుకుంటుంది అదో అద్భుతమైన అనుభూతి ఊరంతా క్రిస్మస్ లైట్ల వెలుగు మత్తుగా వీచే చల్లని చిరుగాలి ఆకాశంలోకి చూస్తాను నిన్ను చూసినట్లే అనిపిస్తుంది నా పక్కనే ఉన్నట్లనిపిస్తుంది నువ్వు కూడా ఇలాగే మిద్దెపైకొచ్చి ఇవే మబ్బులు చూస్తావు... నన్ను కౌగిలించుకున్న ఇదే చిరుగాలి... చలిగాలి నిను తాకుతుంది... నిను అల్లుకుంటుంది వాతావరణం అమ్రుతం తాగినట్లుగా మత్తుగా వుంది... ఉగాది కోయిల కువకువలాడినట్లుగా వుంది. ఒక్కోసారి నువు నవ్వుతావు చూడు... మత్తుగా.... అచ్చం అలాగే... మధువు తాగకుండానే మత్తెక్కించేలా వుంటుంది. ఇప్పుడూ అలాగే వుంది ఇదే ఆకాశం... ఇదే చలిగాలి... ఇక్కడ నేను... అక్కడ నువ్వు... మనల్ని కలిపిన ఈ ప్రక౹తంత స్వచ్ఛమైనది... అద్భుతమైనది మన ప్రేమ కూడా... 21-12-2023, 1am

గుడ్ మార్నింగ్ కన్నలూ...

ఇప్పుడు సమయం... తెల్లవారుఝామున 4.13నిముషాలు ఎందుకో రోజుకంటే ఆలస్యంగా పడుకున్నా ముందే మెలకువ వచ్చేసింది. ఉదయం 5 గంటలకు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడం చాలా కాలంగా ఎంతో ఇష్టంగా చేస్తున్న ఒక తపస్సు. చాలాసార్లు అడిగావు... 'రోజూ అదే సమయానికి ఎలా మెసేజ్ చేస్తున్నారు... ముందుగానే టైం సెట్ చేసుకుంటున్నారా' అని, కాదు, అప్పటికప్పుడే టైప్ చేసి పెడుతున్నానని చెప్పేవాడిని. అలాగే ఇప్పుడు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ కూడా మొబైల్ తీసుకున్నా.... కానీ, ఉదయాన్నే నా పలకరింపు ఏవేవో జ్ఞాపకాలను గుర్తు చేసి, బాధ పడుతుందేమోనని... మొబైల్ లోనే రాసుకుంటున్నా... ఇకపై ప్రతి రోజూ ఇంతేనేమో... అలా రాయొద్దు, ఇలా పెట్టొద్దు అని చెప్పడానికి , నువ్వు ఇబ్బంది పడటానికి బహుశా ఇంకేమీ లేవనుకుంటాను... గతంలో అయితే డైరీ రాసుకునేవాళ్ళు... ఇప్పుడు మొబైల్స్, బ్లాగ్ లు ఉన్నాయి కదా... నీతో మాట్లాడాలని ప్రతిసారీ నా మాటలను, నా ప్రేమను, నా బాధను, నా సంతోషాన్ని... అన్నీ https://udayamithra .blogspot.com లో రాసుకుంటా. నా ఫీలింగ్స్ అన్నీ గూగుల్ భరిస్తుంది... నిన్ను విష్ చేయలేని, నా ఫీలింగ్స్ నీతో పంచుకోలేని ఒకరోజ...

పిచ్చి మనసు

  //పిచ్చి మనసు// నీ పేరు కింద ఆన్ లైన్  కనిపిస్తే... మనసు ఉద్వేగంతో ఊగిపోతది ఒకమాటైనా రాయకపోతావా అని ఉత్సుకతతో ఎదురు చూస్తది నువు మౌనంగా వెళిపోతే... లాస్ట్ సీన్ చూసి మనసు వేదన పడతది కొద్ది క్షణాలలోనే తేరుకుని కొత్త ఆశతో మళ్ళీ ఎదురు చూస్తది ఏమిటో ఈ పిచ్చి మనసు... 17-11-2023

అనుభూతి

  మన ప్రతి కలయికా ఒక మధురమైన అనుభూతి... వీడ్కోలు సమయంలో చెలమలయ్యే నీ కళ్ళను తలుస్తూ... ఇప్పటికీ నా చెక్కిళ్ళు చెరువులవ్వడం మనసు బరువెక్కడం మించిన అనుభూతి మరేముంటుంది.... 12-7-2023

గుడ్ మార్నింగ్...!!

  గుడ్ మార్నింగ్ అని ప్రతి రోజూ వేకువ నే పంపే మొదటి మెసేజ్  నిద్ర లేవగానే  మొదట మాట్లాడేది నీతోనే అని నీ అమూల్యమైన పరిచయం  నిత్యం నాతోనే ఉంటుందని  ప్రతి వేకువ నా మొదటి  ఆలోచన నువ్వేనని  నీకు తెలియాలని... గుడ్ నైట్ అని ప్రతి రాత్రి  నీకు పంపే మెసేజ్  నిద్రించే ముందు  చివరిగా మాట్లాడేది నీతోనేనని నీ జ్ఞాపకాలెప్పుడూ నాతోనే ఉంటాయని ప్రతి రాత్రి నాకు తోడుగా వుండేవి సేద తీర్చేవి నీ జ్ఞాపకాలేనని ఆ జ్ఞాపకాల్లోని నువ్వే  నా నిద్రలోనూ తోడున్నావని నీకు చెప్పేందుకే... వేకువన నీ ఆలోచనతో మొదలై రాత్రి నీ ఆలోచనలతోనే విశ్రమిస్తుంది మనసు... మళ్ళీ వేకువ వస్తుంది  మళ్ళీ రాత్రి వస్తుంది  వేకువలోను రాత్రిలోను తోడుగా ఉంటున్నది... ఉండేది  నువ్వు మాత్రమే...  20-11-2023

బోల్డంత ప్రేమనిచ్చావు...

   బోల్డంత ప్రేమనిచ్చావు.  ఎప్పుడూ అనుభవించనంత సంతోషాన్ని పొందాను.  ఇప్పుడు  ఆ సంతోషాన్ని నీకు ఇచ్చేసి,  నువ్విచ్చిన ప్రేమను, ఆ ప్రేమ మిగిల్చిన బాధను  నేను తీసుకొని వెళ్ళి పోతున్నాను. నువ్వు కోరుకున్న సంతోషం ఇదేగా... ఈ ప్రేమ ఒక పీడకల అనుకో... మెలకువ రాగానే ఆ కలను మర్చిపోయినట్లు ఈ ప్రేమనూ మర్ఛిపో... సంతోషంగా వుండు  నేను దేవుని సన్నిధిలో వాగ్దానం చేశాను  నీ చెయ్యి ఎన్నడూవిడువనని. జీవితాంతం ఆ మాటకే కట్టుబడి వుంటాను. సంతోషం నీకిచ్చేయగా మిగిలిన  మన ప్రేమ, మన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే వుంటాయి. ప్రాణం వున్నంత వరకు నాకు  తోడుగా వుంటాయి. 22-11-2023

సముద్రం ఎప్పుడూ ఒంటరే....

   సముద్రం ఎప్పుడూ ఒంటరే.... అలల తాకిడి ఒడ్డును తాకినప్పుడల్లా  సముద్రం కంపిస్తూనే వుంటుంది  మనస్సూ అంతే....

ప్రశాంతంగా వుండొచ్చు...

  తమరు ప్రశాంతంగా వుండొచ్చు.  ఇకపై గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ తప్ప ఏ మెసేజ్ లు పెట్టను. ఎందుకు చూడట్లేదని అడగను. ఎందుకంటే... ఆన్ లైన్ లోకి వచ్చి కూడా  రోజుల తరబడి చూడకపోవడంతో అంటే... నీ ప్రయారిటీస్ నీకుంటాయి. ఇదేకదా నువ్వు కోరుకుంటున్నది. టేక్ కేర్... నా ప్రియతమా...  నీ జీవితంలో నేను  ఉన్నానో లేదో తెలియదు. కాని, నా జీవితంలోని ప్రతి క్షణంలోనూ నువ్వుంటావు. ఎప్పటికి నా ప్రాణం నువ్వు....😞😢😢😢 10-12-2023

ఆఖరి క్షణం వరకూ

  ఈ గుండె ఎంతవరకు  కొట్టుకుంటుందో తెలియదు కాని, ఆ గుండె కొట్టుకునే ఆఖరి క్షణం వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా... ఐ లవ్ యూ బంగారూ....