లేలేత సూర్యకిరణాలు చిరుచిరు అలలపై తేలియాడుతూ కృష్ణమ్మ పాదాలను సున్నితంగా తాకుతూ గిలిగింతలు పెడుతున్న దృశ్యం... వెండికాంతులీనుతున్న ఉషోదయ కిరణాలు తాకిడికి చిన్నిచిన్ని చేపపిల్లలు బంగారు వర్ణంలో మెరిసిపోయే దృశ్యం... తటిల్లున మనసును పరవశింపజేసింది నేనూ ఒక చేపపిల్లనై చెంగుచెంగున గంతులు వేస్తూ రంగురంగుల చిత్రాన్ని లిఖించితి ఆశ్వాదించే మనసుంటే ప్రకృతిని బంధించే మనోనేత్రం నీవైతే... ప్రతి క్షణమూ ఓ అద్భుతమే మనో ఫలకంపై అద్దిన రంగుల చిత్రమే... (ఒక ఫ్రెండ్ భావనకు నా కవనం. ఆ భావ విపంచికి కృతజ్ఞతలతో....) - రాజాబాబు కంచర్ల 27-07-2022
‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే
మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది.
ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి
ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’