ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చివరకు మిగిలేది

మనసైన వారి నుంచి ప్రాధాన్యతను ఆశించడం
తనకంటూ గుర్తింపు ఉండాలని భావించడం
ఏ బంధంలోనైనా సర్వసాధారణం

ప్రథమం లేకపోవచ్చు
ద్వితీయ ప్రాధాన్యమూ లేకపోవచ్చు
చివరి ప్రాధాన్యమైనా ఉంటుందని ఆశించవచ్చు
కానీ, ప్రాధాన్యత లేనప్పుడు
ఒక ఎంపికగా మారినప్పుడు
ఆ స్థితిని వర్ణించడానికి
అక్షరమాల చాలదేమో.. ...

మనలోని తొందరపాటు గమనించి
వారి ప్రాధాన్యతను గుర్తించండి 

వారి ప్రేమను పొందాలని భావించి 

మన హృదయాన్ని అందించే లోపు 

వారు ఈ లోకంలోనే లేకపోతే
బాధను వర్ణించడానికి 

ఆ కన్నీటికి అడ్డుకట్ట వేయడానికి 

మనసు పడే వేదన చల్లార్చడానికి 

ఏ అక్షరాలు సరిపోవు 

ఏ ఓదార్పులూ సాటిరావు 

మనసున్న మనిషికి చివరిగా మిగిలేది 

వేదన... తీరని ఆవేదనే ... 

19 -06-2022









కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్