ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నేనిక లేనని తెలిశాక... - రవీంద్రనాథ్ ఠాగూర్


 నేనిక లేనని తెలిశాక...

నేనిక లేనని తెలిశాక విషాదాశ్రులను
వర్షిస్తాయి నీ కళ్ళు..
కానీ నేస్తం అది నా కంట పడదు!
ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా!

నీవు పంపించే పుష్పగుచ్ఛాలను
నా పార్ధివదేహం
ఎలా చూడ గలదు?
అందుకే… అవేవో ఇప్పుడే పంప రాదా!

నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావ్
కానీ అవి నా చెవిన పడవు..
అందుకే ఆ మెచ్చేదేదో ఇపుడే మెచ్చుకో !

నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు !
కానీ నాకా సంగతి తెలీదు..
అదేదో ఇపుడే క్షమించేస్తే పోలా?!

నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది
కానీ అది నాకెలా తెలుస్తుంది?
అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !

నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది
అదేదో ఇప్పుడే గడపరాదూ!

సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక!
సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?

ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకు!

 

- రవీంద్రనాథ్ ఠాగూర్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్