ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మనిషి గుండె


జీవితంలో ఎన్నో
మమతలు... ప్రేమానురాగాలు
ఉద్రేకాలు... ఉద్వేగాలు
ఒకదానికొకటి పెనవేసుకొని వుంటాయి
కొన్ని నమ్మకాలు... కొన్ని అభిప్రాయాలు
కొన్నిసార్లు  వాటన్నింటినీ తుచ్ఛమైనవిగా భ్రమింపజేస్తాయి
ఆయా భ్రమల నుంచి బయటపడి...
వాటి విలువ తెలుసుకోడానికి కొంత సమయం పడుతుంది

కానీ...
కాలం కారుమేఘంలా కమ్ముుంది
వాసంతసమీరంలా ఉత్తేజపరుస్తుంది
తింటున్న మంచి తిండి
కట్టుకునే విలువైన గుడ్డలు
కళ్లముందు కదలాడే సొమ్ములు
పదిమందీ కట్టబెట్టే గౌరవము...
జీవితాన్ని సుఖమయం చేస్తుంది

అయితే...
జీవితం అంతటితో ఆగిపోతుందా...?
ఈ సౌకర్యాలన్నీ యిచ్చే ఉద్రేకాలు, సుఖాల సంగతేంటి?
పెనవేసుకున్న ప్రేమానుభవాల మాటేమిటి?
అలవాటైన సుఖానుభవాల చెర నుంచి విడుదలవడం
అంత తేలికైన పనేనా?
ఎంత తలనిండా పనులతో సతమతమయ్యే మనిషికైనా
కొన్ని సందర్భాలుంటాయి..
ఉద్రేకాలు... ఉద్వేగాలు... కోర్కెలను
నెగడులా మండిస్తాయి
అంతా బావుందనుకునే భావాన్ని
కోర్కెల మంటల్లో కాల్చివేస్తుంటాయి

కమ్మిన కారుమేఘాల నుంచి
ఉద్రేకాల ఒత్తిడి నుంచి...
మండే కోర్కెల సెగ నుంచి...
గుండెల నిండా ఎగసిపడే ఉద్రేకాల ఉద్వేగం నుంచి
పిడికెడు గుండె ఎంతకాలం తట్టుకోగలదో మరి...!!
ఎంతయినా మనిషి గుండె కదా...!!

- రాజాబాబు కంచర్ల
 04-07-2022

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్