యండమూరి : ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుంది. ఆ స్త్రీ ప్రేయసి అయితే విజయం యవ్వనం నుంచి ప్రారంభం అవుతుంది. తల్లయితే బాల్యం నుంచే ప్రారంభం అవుతుంది’ ‘వస్తువు పగిలితే శబ్దం వస్తుంది. మనసు పగలిగితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది’ ‘సున్నితత్వం అంటే చిన్నచిన్న విషయాలకి బాధపడటం కాదు. చిన్నచిన్న విషయాలకి ఆనందపడటం.’ ‘నమ్మిన వాటిని ఆచరించకపోవడం ఆచరిస్తున్న వాటిని నమ్మినట్లు నటించడం- మనిషి నిరంతరం చేసుకుంటున్న ఆత్మవంచన’ ‘నీ శరీరం నా చేతుల మధ్య బందింపబడటం కన్నా నీ కీర్తి దిగంతాల పరిధి దాటి విస్తరించటం నాకు సంతోషాన్నిస్తుంది. నా ప్రేమ కోసం నీ కీర్తిని బలిపెట్టలేను’ ‘ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో, అక్కడ ప్రేమని కోల్పోతాడు. తనక్కావాలసిన వ్యక్తి తన పరోక్షంలో కూడా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడనే నమ్మకమే ప్రేమ’
‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే
మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది.
ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి
ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’