ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రేమబంధం

  చోటు ఒక్కటి కాకపోవచ్చు... మనసులెప్పుడూ కలిసే వుంటాయి ఏక తనువుగా ఏక మనస్కులై పెనవేసుకొన్న బంధమై ఎప్పుడూ కలిసే వుంటారు కళ్లు వేరు కావొచ్చు... ఆ కళ్లు కనే కల ఒక్కటే... ఆ కళ్లలో జాలువారే ప్రేమ ఒక్కటే... తనువులు వేరే కావొచ్చు... మనసులెప్పుడూ ఒక్కటే... ఆలోచనలూ ఒక్కటే... ఊపిరీ ఒక్కటే... ఈ బంధం... ఈ ప్రేమ... ఈ మనసులు ఎప్పటికీ ఒక్కటే... 20-06-2022

పరాజితులై నా భాషనే అనుకరించారు - చలం

 

నేనిక లేనని తెలిశాక... - రవీంద్రనాథ్ ఠాగూర్

 నేనిక లేనని తెలిశాక... నేనిక లేనని తెలిశాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు.. కానీ నేస్తం అది నా కంట పడదు! ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా! నీవు పంపించే పుష్పగుచ్ఛాలను నా పార్ధివదేహం ఎలా చూడ గలదు? అందుకే… అవేవో ఇప్పుడే పంప రాదా! నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావ్ కానీ అవి నా చెవిన పడవు.. అందుకే ఆ మెచ్చేదేదో ఇపుడే మెచ్చుకో ! నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు ! కానీ నాకా సంగతి తెలీదు.. అదేదో ఇపుడే క్షమించేస్తే పోలా?! నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది కానీ అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా ! నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడపరాదూ! సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక! సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని? ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకు!   - రవీంద్రనాథ్ ఠాగూర్

ఆలోచించు...

 ‘‘ఎదుటివాని స్థానంలో వుండి ఆలోచించు... తన హృదయంలో జరిగే సంఘర్షణ ఏమిటో అర్థమౌతుంది’’ అంటాడో రచయిత. కానీ.... ఆలోచించాలి కదా...!

నిద్రలేని రాత్రులు

 మనసు నిండా ప్రేమ వున్నవారికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు కచ్చితంగా వుంటాయి...

చివరకు మిగిలేది

మనసైన వారి నుంచి ప్రాధాన్యతను ఆశించడం తనకంటూ గుర్తింపు ఉండాలని భావించడం ఏ బంధంలోనైనా సర్వసాధారణం ప్రథమం లేకపోవచ్చు ద్వితీయ ప్రాధాన్యమూ లేకపోవచ్చు చివరి ప్రాధాన్యమైనా ఉంటుందని ఆశించవచ్చు కానీ, ప్రాధాన్యత లేనప్పుడు ఒక ఎంపికగా మారినప్పుడు ఆ స్థితిని వర్ణించడానికి అక్షరమాల చాలదేమో.. ... మనలోని తొందరపాటు గమనించి వారి ప్రాధాన్యతను గుర్తించండి  వారి ప్రేమను పొందాలని భావించి  మన హృదయాన్ని అందించే లోపు  వారు ఈ లోకంలోనే లేకపోతే ఆ బాధను వర్ణించడానికి  ఆ కన్నీటికి అడ్డుకట్ట వేయడానికి  మనసు పడే వేదన చల్లార్చడానికి  ఏ అక్షరాలు సరిపోవు  ఏ ఓదార్పులూ సాటిరావు  మనసున్న మనిషికి చివరిగా మిగిలేది  వేదన... తీరని ఆవేదనే ...  19 -06-2022